![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి '. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -419 లో...ముకుంద నిజంగానే చనిపోయింది అనుకొని అందరు నమ్ముతారు. శ్రీనివాస్ ఇంటికి వచ్చి డోర్ తియ్యగానే ఎదరుగా ముకుంద కూర్చొని ఉంటుంది. ముకుందని చూసి శ్రీనివాస్ షాక్ అవుతాడు. ఏంటి నాన్న చనిపోయింది ఎలా బ్రతికి వచ్చిందని అనుకుంటున్నావా.. నేను చనిపోలేదు.. ఇదంతా నేను క్రియేట్ చేసిందేనని ముకుంద అంటుంది.
ఆ తర్వాత శ్రీనివాస్ కూడా ముకుందకి సపోర్ట్ గా మాట్లాడతాడు. వాళ్ళు నిన్ను మోసం చేసి ఇంట్లో నుండి పంపించారు. మనం ఎక్కడికైనా వెళదామని శ్రీనివాస్ అనగానే.. మురారికి దూరంగా వెళ్ళడానికా ఇదంతా చేసింది. ఎప్పుడు పక్కనే ఉండడానికి ఇదంతా చేస్తున్నాను. మురారిలాగే నేను రూపం మార్చుకుంటే నన్ను ఎవరు గుర్తుపట్టరని ముకుంద అంటుంది. నిన్ను మోసం చేసినవాళ్లకు ఇలా చెయ్యడమే కరెక్ట్ అని శ్రీనివాస్ అంటాడు. ఈ విషయం ఎవరికీ చెప్పొద్దని శ్రీనివాస్ కి ముకుంద చెప్తుంది. ఆ తర్వాత ఆదర్శ్, తన ఫ్రెండ్ కలిసి డ్రింక్ చేస్తుంటారు. ఇదంతా కృష్ణ మీ కోసం ఏం చెయ్యలేదు.. ముకుందనే బలవంతంగా అయిన నీకు దగ్గర చేస్తే తన భర్తని వదిలేస్తుందని.. అప్పుడు కృష్ణ తన భర్తతో హ్యాపీగా ఉండొచ్చని ఇలా చేసిందని ఆదర్శ్ ఫ్రెండ్ ఆదర్శ్ తో అనగానే ఆదర్శ్ నిజమే అనుకుని కృష్ణపై కోపంగా ఉంటాడు.
ఆ తర్వాత శ్రీనివాస్ అన్న మాటలు గుర్తుకు చేసుకొని కృష్ణ బాధపడుతుంటే అప్పుడే రేవతి వచ్చి అడుగుతుంది. ముకుంద ఇంత పిచ్చి పని చేస్తుందని అనుకోలేదు అనగానే.. అంత నీ పుణ్యమే కదా అంటు ఆదర్శ్ వస్తాడు. ఇదంతా జరగడానికి కారణం మాత్రం నువ్వే అని కృష్ణపై ఆదర్శ్ కోప్పడతాడు. కృష్ణ అలాంటిది కాదని రేవతి, సుమలత, నందు చెప్పిన వినకుండా కృష్ణ వల్లే ఇదంతా అని ఆదర్శ్ అంటాడు. తరువాయి భాగంలో ముకుంద చాటుగా వచ్చి మురారిని చూస్తుంది. మురారి కూడా ముకుందని చూసి పరుగెడతాడు. మరొకవైపు రేవతికి కూడా ముకుంద వెనకాల వైపు నుండి కనిపిస్తుంది. ఆ తర్వాత కృష్ణ బట్టలు తీస్తుంటే బట్టల చాటున ముకుంద ఉంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |